ట్రాక్టర్ డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోలేదట..!

కారులో సీటు బెల్ట్ పెట్టుకోకపోతే అధికారులు ఫైన్ వేయడం మామూలే.. అయితే సీటు బెల్ట్ లేదని ట్రాక్టర్ డ్రైవర్ కు ఫైన్ వేసిన ఓ విచిత్రమైన ఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది

By Medi Samrat  Published on  4 April 2024 9:45 PM IST
ట్రాక్టర్ డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోలేదట..!

కారులో సీటు బెల్ట్ పెట్టుకోకపోతే అధికారులు ఫైన్ వేయడం మామూలే.. అయితే సీటు బెల్ట్ లేదని ట్రాక్టర్ డ్రైవర్ కు ఫైన్ వేసిన ఓ విచిత్రమైన ఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది. ట్రాక్టర్ డ్రైవరుకు సీటు బెల్టు లేదని పోలీసులు ఫైన్ వేయడంతో ట్రాక్టర్ డ్రైవర్ కాస్తా షాక్ అయ్యాడు. జగన్నాథపురంలో సీటు బెల్టు పెట్టుకోకుండా ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్నారంటూ 100 రూపాయలు ఫైన్ వేశారు అధికారులు. ట్రాక్టరుకు అసలు సీట్ బెల్ట్ ఉండదని ట్రాక్టర్ యజమాని చెబుతున్నారు. ఈ విషయం గురించి తెలుసుకోవాలని షోరూమ్ కి కూడా ఫోన్ చేసామని.. అయితే ట్రాక్టర్ కు సీటు బెల్ట్ అనేదే ఉండదని చెప్పారని ట్రాక్టర్ డ్రైవర్ తెలిపారు.

Next Story