పుట్టింటికి వెళ్లిన భార్య.. కాపురానికి రప్పించేందుకు భర్త క్షుద్రపూజలు.!

The husband who performed occult worship to bring his wife to Kapura. పుట్టింటికి వెళ్లిన భార్యను కాపురానికి రప్పించేందుకు మాంత్రికుడితో క్షుద్రపూజలు చేయించాడో భర్త. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఘటన

By అంజి  Published on  6 Dec 2021 3:56 AM GMT
పుట్టింటికి వెళ్లిన భార్య.. కాపురానికి రప్పించేందుకు భర్త క్షుద్రపూజలు.!

పుట్టింటికి వెళ్లిన భార్యను కాపురానికి రప్పించేందుకు మాంత్రికుడితో క్షుద్రపూజలు చేయించాడో భర్త. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాల్వంచ పట్టణానికి చెందిన శేఖరంబంజరకు జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంకు చెందిన యువతితో నాలుగేళ్ల కిందటపెళ్లి జరిగింది. శేఖరం కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే వీరికి సంతాన లేమి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో భార్యాభర్తల మధ్య కలహాలు రేగాయి.

ఆ తర్వాత వేరే ప్రాంతంలో కాపురం పెట్టారు. అయినా వారి మధ్య మనస్పర్థలు ఆగలేదు. ఐదు నెలల కిందట శేఖరం వృత్తి రీత్యా 10 రోజుల పాటు వేరే రాష్ట్రానికి వెళ్లాడు. అదే సమయంలో భార్య పుట్టింటికి వెళ్లింది. అక్కడి నుండి మణుగూరులో ఉంటున్న బంధువుల ఇంటికి చేరుకుంది. భర్త శేఖరం ఇంటికి తిరిగొచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఫోన్‌ చేసిన భార్య స్పందించలేదు. చివరకు క్షుద్రపూజలు చేసి భార్యను కాపురానికి రప్పించవచ్చన్న స్నేహితుల సూచనను పాటించాడు. రెండు నెలల క్రితం సుజాతనగర్‌లోని ఓ మాంత్రికుడికి రూ.30 వేలు ఇచ్చి పూజలు చేయించాడు. ఆ తర్వాత 4 రోజులకు భార్య నుండి ఫోన్‌ కాల్‌ వచ్చింది.

దీంతో శేఖరం మణుగూరు వెళ్లాడు. విషయం తెలుసుకున్న భార్య బంధువుల భర్త శేఖరం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు భార్య,భర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. అప్పటి నుండి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇదిలా ఉంటే దీనికి క్షుద్ర పూజల దృశ్యాలు సోషల్‌ మీడియాలో తాజాగా వైరల్‌ అవుతున్నాయి. తన భర్తకు మొదట వేరొకరితో వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలున్నారని, ఆమెను వదిలేశాక నాతో పెళ్లి జరిగిందని యువతి తెలిపింది. అయితే ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధపడి.. తనను మంత్రాలతో చంపాలనుకున్నాడని భార్య ఆరోపించింది.

Next Story
Share it