తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో 198 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. జనవరి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలంగాణ పోలీసు నియామక మండలి సంచాలకులు వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. ఆర్టీసీలో 84 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, 114 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల కోసం ఈ ప్రకటన విడుదలైంది. జీతం నెలకు రూ.27వేల నుంచి రూ.81వేల వరకు ఉంది.
ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు www.tgprb.in వెబ్‌సైట్లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు, ఎంపిక విధానం, ఇతర వివరాలు ఇదే వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.400, మిగతా వారికి రూ.800గా నిర్ణయించారు. వయసు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు. విద్యార్హత పోస్టులను బట్టి టెన్త్, డిగ్రీ.