విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీజీఆర్టీసీ

హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.

By Knakam Karthik
Published on : 9 Jun 2025 1:00 PM IST

Hyderabad, Tgsrtc, Students, Bus Passes

విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీజీఆర్టీసీ

హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సాధారణ స్కూల్, ఇంటర్, డిగ్రీ కాలేజీలకు వేసవి సెలవులు ఇవ్వగా ఈ నెల 12 నుంచి స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 12 నెల నుంచి కొత్త బస్ పాస్‌లను జారీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కాగా బస్ పాస్‌లు జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీ వ్యాప్తంగా ఉన్న 40 ఆర్టీసీ కేంద్రాల్లో విద్యార్థులు ఈ బస్ పాస్‌లను పొందవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. అలాగే కొత్త బస్ పాస్ ల కోసం.. www.tgsrtc.telangana.gov.in/bus-pass-services వెబ్ సైట్లో అప్లై చేసుకొవాలి. అనంతరం అప్లికేషన్ ఫామ్‌ను తీసుకెళ్లి విద్యార్థులకు దగ్గరలో ఉన్న బస్ పాస్ కౌంటర్లలో ఇస్తే.. స్టూడెంట్ బస్ పాస్ జారీ అందజేస్తారని.. ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Next Story