తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిజిఐఐసి) వికారాబాద్ జిల్లాలోని లగచర్లతోపాటు మూడు గ్రామాల పరిధిలోని ఫార్మా విలేజ్‌కు బదులుగా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు భూమిని సేకరించేందుకు కొత్త అభ్యర్థన ప్రతిపాదనలను సమర్పించింది. ఫార్మా కంపెనీ భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
వికారాబాద్ జిల్లా లగచర్ల హకీంపేట్, పోలేపల్లి గ్రామాలలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. స్థానిక గ్రామస్థుల నుంచి వెల్లడైన ఆందోళనలు, అభ్యంతరాల నేపథ్యంలో ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. భూ సేకరణ చట్టం-2013 లోని సెక్షన్ 93 ప్రకారం లగచర్ల భూ సేకరణను ఉపసంహరించుకున్నట్లు నోటిఫికేషన్ విడులైంది.