తెలంగాణలో భారీగా పెరిగిపోయిన ఉష్ణోగ్రతలు

Temperatures soar across Telangana. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు భారీగా మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్

By Medi Samrat  Published on  18 March 2022 5:42 PM IST
తెలంగాణలో భారీగా పెరిగిపోయిన ఉష్ణోగ్రతలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు భారీగా మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటాయి. 33 జిల్లాల్లో కనీసం 14 జిల్లాల్లో 41 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో గురువారం 39.6 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. రాష్ట్రవ్యాప్తంగా నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 18.5 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో రాత్రి సమయాల్లో ఉక్కపోత ఎక్కువవుతూ ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో వేడిగాలుల వంటి పరిస్థితులను చూడవచ్చని అధికారులు చెబుతున్నారు.

"మేము 14 జిల్లాలకు తీవ్రమైన హీట్ వేవ్ హెచ్చరికలను జారీ చేస్తున్నాము. ఉత్తర తెలంగాణ అత్యంత వేడిగా ఉంటుంది. తూర్పు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నల్గొండ, ఆదిలాబాద్‌లో వేడి గాలులు అధికమయ్యే అవకాశం ఉంది" అని ఐఎండీ హైదరాబాద్‌కు చెందిన సైంటిస్ట్ సి ఇంచార్జి డాక్టర్ ఎ శ్రావణి తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగా 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, ఉత్తరం నుండి వచ్చే వేడి గాలులు ప్రస్తుత పరిస్థితిని మారుస్తాయని, వచ్చే వారం ఉషోగ్రతలు క్రమంగా పడిపోవచ్చని అధికారులు తెలిపారు.

గురువారం నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు (తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ) :

పెద్దపల్లి - 42.9 డిగ్రీల సెల్సియస్

నిర్మల్ - 42.5 డిగ్రీల సెల్సియస్

జగిత్యాల్ - 42.3 డిగ్రీ సెల్సియస్

ఆదిలాబాద్ - 42.1 డిగ్రీ సెల్సియస్

భద్రాద్రి కొత్తగూడెం - 41.8 డిగ్రీల సెల్సియస్

ఖమ్మం - 41.8 డిగ్రీల సెల్సియస్

నిజామాబాద్ - 41.5 డిగ్రీల సెల్సియస్

మంచిర్యాల - 41.7 డిగ్రీ సెల్సియస్

సూర్యాపేట - 41.5 డిగ్రీల సెల్సియస్

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ - 41.4 డిగ్రీల సెల్సియస్














































Next Story