తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య ఎంతంటే.?

తెలంగాణ రాష్ట్రంలో వాహనాల సంఖ్యకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

By Medi Samrat
Published on : 20 March 2025 8:45 PM IST

తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య ఎంతంటే.?

తెలంగాణ రాష్ట్రంలో వాహనాల సంఖ్యకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. రాష్ట్ర రవాణా శాఖ ప్రకారం, తెలంగాణలో ఇప్పుడు ఉన్న 3.7 కోట్ల జనాభాకు 1.72 కోట్ల రిజిస్టర్డ్ వాహనాలు ఉన్నాయి. అంటే ప్రతి ఇద్దరికీ దాదాపుగా ఒక వాహనం ఉందన్నమాట. ఫిబ్రవరి 2025 నాటికి, ఈ జాబితాలో మోటార్ సైకిళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మొత్తం వాహనాల సంఖ్యలో 70 శాతం బైక్స్ ఉన్నాయి. తరువాత లిస్టులో కార్లు, క్యాబ్‌లు 20 శాతం ఉన్నాయి. మిగిలిన 10 శాతంలో ట్రాక్టర్లు, గూడ్స్ క్యారియర్లు, ఆటో-రిక్షాలు ఉన్నాయి.

1.2 కోట్ల మోటార్ సైకిళ్ళు

23.3 లక్షల కార్లు

7.7 లక్షల ట్రాక్టర్లు, ట్రైలర్లు

6.5 లక్షల సరకు రవాణా వాహనాలు

5.1 లక్షల ఆటో-రిక్షాలు

తెలంగాణ అంతటా సగటున రోజుకు 2,000 కొత్త వాహనాలు నమోదు అవుతున్నాయి. వాహన యాజమాన్యంలో స్థిరమైన పెరుగుదల రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణ, ఆర్థిక కార్యకలాపాలు, పెరిగిన ఆర్థిక స్థోమతను ప్రతిబింబిస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ తమ పర్సనల్ వాహనాలను వినియోగిస్తూ ఉండడంతో పర్యావరణంపై కూడా ప్రభావం చూపనుంది.

Next Story