దేశ రక్షణలో తెలంగాణది కీలక పాత్ర: సీఎం రేవంత్
దేశాన్ని రక్షించడంలో తెలంగాణ రాష్ట్రం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik
దేశ రక్షణలో తెలంగాణది కీలక పాత్ర: సీఎం రేవంత్
దేశాన్ని రక్షించడంలో తెలంగాణ రాష్ట్రం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో విజ్ఞాన్ వైభవ్-2025 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ దేశ రక్షణ బాధ్యత యువతీ, యువకులపై ఉంది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. బీడీఎల్, డీఆర్‌డీఓ, మిదాని, హెచ్‌ఏఎల్ వంటి దేశ రక్షణ కోసం రాకెట్లు, మిస్సైల్స్ తయారు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి..అని సీఎం రేవంత్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం లక్షకు పైగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదివి.. అమెరికాకు వెళ్తున్నారు. వారిలో దేశ భక్తితో పాటు.. దేశ రక్షణ ప్రాధాన్యతలను వివరించడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రం నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ మాత్రమే అమెరికాకు వెళ్లకుండా.. దేశ రక్షణ రంగానికి అవసరమైన, సమర్థవంతమైన ఇంజినీర్లను అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. దేశ రక్షణ కోసం అవసరమైన ఇంజినీర్లను తయారు చేయడం మరింత ముఖ్యం..అని సీఎం చెప్పారు. బెంగళూరు తరహాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రక్షణ శాఖ కారిడార్లు ఏర్పాటు చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం కోరారు.