బహ్రెయిన్‌లో జైలు పాలైన నిజామాబాద్ వ్య‌క్తి.. సీఎంకు కుటుంబ‌స‌భ్యుల‌ విన‌తి

నిజామాబాద్‌కు చెందిన 60 ఏళ్ల కార్మికుడు గల్ఫ్ దేశమైన బహ్రెయిన్‌లో ఎక్కువ కాలం గడిపినందుకు జైలు పాలయ్యాడు.

By Medi Samrat  Published on  28 Dec 2024 12:49 PM IST
బహ్రెయిన్‌లో జైలు పాలైన నిజామాబాద్ వ్య‌క్తి.. సీఎంకు కుటుంబ‌స‌భ్యుల‌ విన‌తి

నిజామాబాద్‌కు చెందిన 60 ఏళ్ల కార్మికుడు గల్ఫ్ దేశమైన బహ్రెయిన్‌లో ఎక్కువ కాలం గడిపినందుకు జైలు పాలయ్యాడు. కంచు గంగయ్య 2008లో బహ్రెయిన్‌కు వెళ్లి ఆ తర్వాత తిరిగి రాష్ట్రానికి రాలేదు. గంగయ్యను తెలంగాణకు రప్పించేందుకు ప్రభుత్వం సహకరించాలని గంగయ్య భార్య కంచు లక్ష్మి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందించారు.

గంగయ్య వీసా, పాస్‌పోర్టు గడువు ముగిసిందని, అతను బహ్రెయిన్‌లో అక్రమ వలసదారుగా ఉంటున్నాడని ఆమె చెప్పారు. దాదాపు ఆరు నెలల క్రితం బహ్రెయిన్ పోలీసులు అక్రమంగా బస చేసినందుకు అరెస్టు చేశారని ఆమె తెలిపారు. బహ్రెయిన్‌కు వెళ్లినప్పటి నుంచి గంగయ్య గత 16 ఏళ్లుగా భారత్‌కు తిరిగి రాలేదని అంటున్నారు. కుటుంబం బహ్రెయిన్‌లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించింది, ఇది అతని గుర్తింపుకు సంబంధించిన డాక్యుమెంట్ వివరాలను కోరుతూ.. ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం, హైదరాబాద్‌కు లేఖ రాసింది.

గంగయ్య గతంలో సౌదీ అరేబియాలో ఆరేళ్లు, దుబాయ్‌లో మూడేళ్లు పనిచేశారు. బహ్రెయిన్ పోలీసులు తనిఖీలు, ధృవీకరణల సమయంలో అతని వద్ద పాస్‌పోర్ట్, వీసా లేదని గుర్తించడంతో అతన్ని అరెస్టు చేశారు.

Next Story