తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి.. సంస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ప్రజా రవాణాను.. ప్రజల దగ్గరకు చేర్చేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. తాజాగా అర్ధరాత్రి సమయాలలో ఆర్టీసీ బస్సులలో మహిళల సౌకర్యం కోసం ( వాష్ రూమ్స్ ) బస్సులను పెట్రోల్ పంప్ లలో 10 నిమిషాలు బస్సు ఆపాలని కోరిన యువతి పాలే నిషా ట్వీట్‌ చేసింది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని యువతి తెలిపింది. అయితే అర్థరాత్రి టీఎస్‌ఆర్టీసీకి యువతి చేసిన ట్వీట్‌కి ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందించారు.

ఈ విషయం పై అధికారులకు సూచించినట్లు సజ్జనార్‌ రిప్లయ్ ఇచ్చారు. అర్ధరాత్రి సైతం మహిళ సమస్య పై సజ్జనార్ స్పందించడంతో ఆనందం వ్యక్తం చేసిన పాలే నిషా కృతజ్ఞతలు తెలిపారు. సోషల్‌ మీడియాలో ఎండీ సజ్జనార్‌ టీఎస్‌ఆర్టీసీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ పోస్టులు చేస్తూ.. మంచి హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ ఆదాయం పెంచడంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంక్రాంతి పండుగకు సైతం ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ప్రయాణ సౌకర్యం కల్పించారు.


అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story