తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న మహాలక్ష్మీ పథకంతో రాష్ట్ర ఆర్టీసీ మరో మైలు రాయిని దాటింది. ఇప్పటివరకు తెలంగాణ ఆర్టీసీలో 200 కోట్ల మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మహిళల ఉచిత ప్రయాణం విలువ రూ.6700 కోట్లు అని తెలిపింది. కాగా తెలంగాణ ఆర్టీసీకి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నివేదిక విడుదల చేస్తుంది. 200 కోట్ల మంది మహిళల ఉచిత ప్రయాణం పురస్కరించుకుని రేపు రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలు, 341 బస్ స్టేషన్లలో సంబరాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.