ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పిన సీఎం రేవంత్

భారత ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా థ్యాంక్స్ చెప్పారు.

By Knakam Karthik
Published on : 1 March 2025 7:06 AM IST

Telangana, CM RevanthReddy, Prime Minister Modi, Warangal Mamunur Airport

ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పిన సీఎం రేవంత్

భారత ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా థ్యాంక్స్ చెప్పారు. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి అనుమతి మంజూరు చేసినందుకు తెలంగాణ ప్రజల తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు..అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే.రామ్మోహన్ నాయుడు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు.. వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మామూనూరు ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్కి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కి.మీ పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టాలని ఎయిర్ పోర్ట్ అథారిటీని రామ్మోహన్ నాయుడు ఆదేశించారు.

Next Story