కోళ్ల మరణాలపై అప్రమత్తమైన‌ తెలంగాణ పౌల్ట్రీ యజమానులు

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని ఒక పౌల్ట్రీ ఫాంలో 4,200 కోడిపిల్లలు మరణించిన నేపథ్యంలో తెలంగాణ పశుసంవర్ధక శాఖ, పౌల్ట్రీ ఫారాలు రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉన్నాయి.

By Medi Samrat
Published on : 23 Jan 2025 3:30 PM IST

కోళ్ల మరణాలపై అప్రమత్తమైన‌ తెలంగాణ పౌల్ట్రీ యజమానులు

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని ఒక పౌల్ట్రీ ఫాంలో 4,200 కోడిపిల్లలు మరణించిన నేపథ్యంలో తెలంగాణ పశుసంవర్ధక శాఖ, పౌల్ట్రీ ఫారాలు రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉన్నాయి. లాతూర్ ఘటన నేపథ్యంలో పౌల్ట్రీ ఫామ్‌ ఓనర్లు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, భద్రతా చర్యలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని సీనియర్ అధికారులు తెలిపారు.

2005లో దేశంలో మొదటిసారిగా బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన పటిష్టమైన వ్యవస్థను అమలు చేస్తున్నామని పశుసంవర్థక శాఖలోని ఎపిడెమియాలజీ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఈ వ్యవస్థలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ ఫామ్‌ల నుండి క్రమం తప్పకుండా 1,000 కంటే ఎక్కువ నమూనాలను సేకరించి, వాటిని తెలంగాణ స్టేట్ వెటర్నరీ బయోలాజికల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (VBRI)కి పంపుతున్నారు. అక్కడ వ్యాధి నివారణ, వ్యాధి నిర్ధారణ, వ్యాక్సిన్‌ల ఉత్పత్తి, అభివృద్ధి చెందుతున్న వ్యాధులపై పరిశోధనలు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి.

Next Story