ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబి) మాజీ చీఫ్ ప్రభాకర్ రావును శుక్రవారం ఉదయం 11 గంటలకు పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది.

By -  Medi Samrat
Published on : 11 Dec 2025 5:33 PM IST

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబి) మాజీ చీఫ్ ప్రభాకర్ రావును శుక్రవారం ఉదయం 11 గంటలకు పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. జస్టిస్ బివి నాగరత్న, ఆర్‌ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ప్రభాకర్ రావుపై వచ్చిన ఆరోప‌ణ‌ల‌పై తదుపరి విచారణ నిమిత్తం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది.

రేపు ఉదయం 11.00 గంటలలోపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని పిటిషనర్‌ని మేము ఆదేశిస్తున్నాము.. కస్టడీ విచారణ చట్టానికి లోబడి జరగాలి. శుక్రవారం జాబితా చేయండి. పిటిషనర్‌కు అతని ఇంటి నుండి ఆహారం, క్రమం తప్పకుండా మందులు తీసుకునే స్వేచ్ఛ ఉంది" అని బెంచ్ తెలిపింది.

ఈ కేసుకు సంబంధించి దర్యాప్తునకు ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించడం లేదని, ఆయనకు గతంలో మంజూరు చేసిన మధ్యంతర అరెస్ట్ ఉపశమనాన్ని ఎత్తివేయాలని కోరుతూ సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసులో కీలకమైన ఐఫోన్‌కు సంబంధించిన క్లౌడ్ ఖాతాల పాస్‌వర్డ్‌లను ఆయన రీసెట్ చేసి, సమాచారం ఇవ్వడం లేదని తమ పిటిషన్‌లో ఆరోపించారు. సిట్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Next Story