వ‌ర్క్ ఫ్రం హోం చేస్తున్న మంత్రి కేటీఆర్‌.. వాట్స‌ప్ అకౌంట్ బ్లాక్

Telangana minister KTR's WhatsApp was blocked.తెలంగాణ రాష్ట్ర స‌మితి కార్య నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మంత్రి కేటీఆర్ ఎడ‌మ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2022 4:01 AM GMT
వ‌ర్క్ ఫ్రం హోం చేస్తున్న మంత్రి కేటీఆర్‌.. వాట్స‌ప్ అకౌంట్ బ్లాక్

తెలంగాణ రాష్ట్ర స‌మితి కార్య నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మంత్రి కేటీఆర్ ఎడ‌మ కాలి చీల‌మండ‌ల కండ‌ర గాయంతో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. వైద్యులు ఆయ‌న‌కు మూడు వారాల విశ్రాంతి అవ‌స‌రం అని తెల‌ప‌డంతో కాలికి ప‌ట్టి వేసుకుని ప్ర‌స్తుతం ఇంట్లోనే ఉన్నారు. తాను ఇంటి నుంచే ప‌ని(వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం) చేస్తున్న‌ట్లు కేటీఆర్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. త‌న విభాగ‌పు ఫైల్స్‌ను ప‌రిశీలిస్తున్న ఫోటోను ట్విట‌ర్‌లో షేర్ చేశారు.


వాట్స‌ప్ సేవ‌ల‌కు అంత‌రాయం..

మంత్రి కేటీఆర్ వాట్సాప్ సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ట్విటర్ ద్వారా తెలియ‌జేశారు. 'నా వాట్సప్‌ అకౌంట్ ఆగిపోయింది. సోమవారం మూడుసార్లు ఆ సేవలు నిలిచిపోయాయి. 8 వేల కంటే ఎక్కువ మెసేజ్‌లు వచ్చాయి. వీలైనన్ని వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. ఈ నేపథ్యంలోనే మూడుసార్లు నా వాట్సప్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. 24 గంటలుగా వాట్సప్‌ అకౌంట్‌ పనిచేయడం లేదు. స్పామ్(Spam) కారణంగా సేవల వినియోగానికి వాట్సాప్ అనుమతించడం లేదు. డిటిజల్‌ సవాళ్లు చాలా క్లిష్టంగా ఉంటాయి' అంటూ కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

Next Story
Share it