తెలంగాణ రాజకీయాల్లో తరచూ వివాదాదస్పద కామెంట్లతో వార్తలో నిలిచే రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మరోసారి దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. భారత రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులకు నరనరాలో కుల పిచ్చి పాతుకుపోయిందని, పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును వితంతు మహిళ అని మోదీ పిలవలేదని, రాషపతి దళిత మహిళ కాబట్టి అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సైతం పిలవలేదని సంచలన ఆరోపణలు చేశారు.