సీఎం చంద్రబాబును కలిసిన మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు.

By -  Medi Samrat
Published on : 5 Dec 2025 7:49 PM IST

సీఎం చంద్రబాబును కలిసిన మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో జరప తలపెట్టిన ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'ను దావోస్ సమ్మిట్ తరహాలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులు సదస్సుకు హాజరవుతున్నట్టు ముఖ్యమంత్రికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు.

Next Story