తెలంగాణ అసెంబ్లీ వాయిదా

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ స‌మావేశాల‌ను ఈ నెల 27కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు

By Medi Samrat  Published on  25 July 2024 4:21 PM IST
తెలంగాణ అసెంబ్లీ వాయిదా

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ స‌మావేశాల‌ను ఈ నెల 27కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క బ‌డ్జెట్ ప్ర‌సంగం ముగిసిన వెంట‌నే స‌భ‌ను శ‌నివారానికి వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు. శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల‌కు స‌భ తిరిగి ప్రారంభం కానుంది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యవయం రూ.2,20,945 కోట్లు. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా బడ్జెట్‌లో తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దుబారా ఖర్చులు కట్టడి చేసి.. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌ దారులకు సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించామని భట్టి విక్రమార్క తెలిపారు. గత పాలకులు రూ.6,71,757 కోట్లు అప్పు చేసినా.. వాటిని తీర్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా.. సంక్షేమాన్ని విస్మరించలేదన్నారు.

Next Story