సీఎం నియోజకవర్గంలో రోడ్డు మీదకు వచ్చిన విద్యార్థినులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Aug 2024 7:51 AM GMT
telangana, kodangal, cm revanth reddy, students, strike ,

సీఎం నియోజకవర్గంలో రోడ్డు మీదకు వచ్చిన విద్యార్థినులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చారు. నాచారంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో హాస్టల్‌లో నాసిరకం భోజనం పెడుతున్నారంటూ విద్యార్థినులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళనకు దిగారు. ‘మాకు న్యాయం కావాలి’ అంటూ నినాదాలు చేశారు. అన్నం, కూరల్లో పురుగులు చాలాసార్లు వచ్చాయని.. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు.

విద్యార్థుల బాధలను పట్టించుకోని అధికారులను బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని, పుస్తకాలు కూడా ఇవ్వడం లేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్‌ ఆగిపోయింది. పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులకు సర్దిచెప్పారు.

Next Story