బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సమక్షంలో నిన్న అర్థరాత్రి ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు.

By అంజి  Published on  5 July 2024 10:34 AM IST
Telangana, BRS,  MLCs, Congress

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు 

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సమక్షంలో నిన్న అర్థరాత్రి ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరడంతో కె. చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలతో సహా పలువురు నేతలు పార్టీని వీడిపోవడంతో భారత రాష్ట్ర సమితిలో ఫిరాయింపులు పెరిగాయి.

తాజాగా ఎమ్మెల్సీలు భాను ప్రసాద్‌, సారయ్య, దండె విఠల్‌, ఎంఎస్ ప్రభాకర్‌, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్‌లకు పార్టీ రాష్ట్ర దీపాదాస్ మున్షీ కాంగ్రెస్‌ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40. ప్రస్తుతం 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు ఆరుగురు మాత్రమే సభ్యులు న్నారు. తాజాగా ఆరుగురు సభ్యులు చేరడంతో వారి బలం 12కు చేరింది. కాగా ఇటీవల ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్‌ కుమార్‌ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరినట్లు అయింది.

Next Story