రైల్‌ రోకో ఘటన.. కేసీఆర్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకో ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెచంద్రశేఖర రావు పిటీషన్ ను దాఖలు చేశారు.

By Medi Samrat
Published on : 1 April 2025 9:15 PM IST

రైల్‌ రోకో ఘటన.. కేసీఆర్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకో ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెచంద్రశేఖర రావు పిటీషన్ ను దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. 2011 అక్టోబర్ 15న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా సికింద్రాబాద్‌లో రైల్ రోకో చేపట్టారు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసు ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగులో ఉంది. రైల్ రోకో జరిగిన సమయంలో అక్కడ కేసీఆర్ లేరని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. వాదనలు విన్న న్యాయస్థానం రైల్ రోకో ఘటన గురించి ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసు ఇవ్వాలని ఆదేశించింది.

Next Story