గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు వేసిన పిటిషన్ మీద విచారణను హైకోర్టు వాయిదా వేసింది. పిటిషన్‌కు విచారణార్హతపై తేలుస్తామని ధర్మాసనం శుక్రవారం తెలిపింది. తదుపరి విచారణను జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది. గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. గవర్నర్ సౌందరరాజన్ ఈ ఫైలును తిరస్కరించారు. దీంతో వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్ 171 ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీల్లేదని పిటిషనర్లు కోర్టుకు వెల్లడించారు. అదే సమయంలో ఆర్టికల్ 361 ప్రకారం పిటిషన్‌కు అర్హత లేదని గవర్నర్ తరఫు న్యాయవాది, హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని ఆ అభ్యర్ధనను గవర్నర్ ఆపడానికి వీలు లేదని దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటీషన్ మెంటేనబిలిటీ పై విచారణ జరుపుతామని తెలిపింది. తదుపరి విచారణ జనవరి 24 కు వాయిదా వేసింది. కాగా, గత బీఆర్ఎస్ సర్కార్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయన పేర్లను సూచించింది. ఇందుకు అప్పటి క్యాబినెట్ కూడా ఆమోద ముద్రవేసింది. గవర్నర్ ఈ నియామకాలను హోల్డ్ లో పెట్టారు. ఇంతలో ప్రభుత్వం కూడా తెలంగాణలో మారిపోయింది.