Telangana : గ్రూప్-I మెయిన్స్ పరీక్ష హాల్ టిక్కెట్స్‌ డౌన్‌లోడ్ చేసుకునే తేదీ ఇదే..!

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్

By Medi Samrat  Published on  9 Oct 2024 8:15 PM IST
Telangana : గ్రూప్-I మెయిన్స్ పరీక్ష హాల్ టిక్కెట్స్‌ డౌన్‌లోడ్ చేసుకునే తేదీ ఇదే..!

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. హాల్ టిక్కెట్‌లను అభ్యర్థులు అక్టోబర్ 14 నుండి కమిషన్ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 21 నుండి 27 వరకు హైదరాబాద్‌లో (HMDA అధికార పరిధితో సహా) మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సెంటర్ గేట్ మూసివేయనున్నారు. గేట్ మూసివేసిన తర్వాత అభ్యర్థులెవరినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

జూన్‌ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించారు. ఈ ఎగ్జామ్ కు మొత్తం 3.02 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ కు మొత్తం 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు.

Next Story