తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు తొలగిన అడ్డంకులు
Telangana Group-1 Preliminary Examination. తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పై స్టే ఇచ్చేందుకు
By Medi Samrat Published on 5 Jun 2023 7:51 PM IST![తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు తొలగిన అడ్డంకులు తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు తొలగిన అడ్డంకులు](https://telugu.newsmeter.in/h-upload/2023/06/05/347278-telangana-group-1-preliminary-examination.webp)
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పై స్టే ఇచ్చేందుకు ఇటీవల నిరాకరించిన హైకోర్టు, పరీక్ష రద్దుపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. జూన్ 11న జరిగే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పటికే టీఎస్పీఎస్సీ గ్రూప్ -1 ప్రిలిమ్స్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటీవలె హాల్ టికెట్లను విడుదల చేశారు. పేపర్లు లీకేజీ తర్వాత కూడా సిబ్బందిని మార్చకుండా పరీక్ష నిర్వహిస్తున్నారని ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షల మధ్య వ్యవధి 45 రోజుల నుంచి రెండు నెలలు ఉండాలని దాఖలైన పిటిషన్లు ఇది వరకే విచారించిన హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో జూన్ 11న యథావిధిగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
గత ఏడాది ఏప్రిల్ 26న 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,80,202 మంది అప్లై చేసుకోగా.. అక్టోబరు 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. 2,85,916 మంది హాజరయ్యారు. పేపర్ లీక్ కారణంతో ఈ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహిస్తుంది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు టీఎస్పీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ కూడా రద్దు చేశారు అధికారులు. జూన్ 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష జరుగనుంది. గత అక్టోబరులో ప్రిలిమ్స్ కోసం డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లు ఇప్పుడు పనిచేయవని.. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in / నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.