తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జను నియమించింది. గత ప్రభుత్వంలో సీఎం సెక్రటరీగా పని చేసిన స్మిత సబర్వాల్‌ను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్‌గా అపాయింట్ చేసింది.
భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ ను నియమించగా.. ఇరిగేషన్ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించింది ప్రభుత్వం. సీఎంవో సంయుక్త కార్యదర్శిగా సంగీతా సర్వే సత్యనారాయణను నియమించింది ప్రభుత్వం. నల్గొండ జిల్లా కలెక్టర్ గా హరిచంద్రను నియమించింది. మొత్తం 26 మంది అధికారులకు తెలంగాణ ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది.