దివ్యాంగులకు సీఎం గుడ్‌న్యూస్‌.. ఆసరా పెన్షన్‌ రూ.4016 కు పెంచుతూ ఉత్తర్వులు

Telangana Govt Has Issued An Order Increasing Aasara Pension Of Disabled Persons By Rs 4016. తెలంగాణలోని దివ్యాంగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు.

By Medi Samrat  Published on  22 July 2023 8:54 PM IST
దివ్యాంగులకు సీఎం గుడ్‌న్యూస్‌.. ఆసరా పెన్షన్‌ రూ.4016 కు పెంచుతూ ఉత్తర్వులు

తెలంగాణలోని దివ్యాంగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. ఆసరా పెన్షన్లను రూ.4016 కు పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన పెన్షన్‌ జులై నెల నుంచి అమలులోకి రానుందని ప్రభుత్వం తెలిపింది. గ‌తంలో రూ.3016 ఉండ‌గా.. రూ.4016 కు పెంచనున్న‌ట్లు ఇటీవ‌ల‌ ప్ర‌క‌టించారు. ఈ మేరకు పెన్షన్లను పెంచారు. ఈ నిర్ణ‌యంతో రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి కలుగనుంది.

పెన్షన్ల పెంపుపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా దివ్యాంగులకు రూ.4016కు పెన్షన్‌ పెంచినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్ల పెంపు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. చారిత్రాత్మక నిర్ణయంతో 5లక్షల మందికిపైగా దివ్యాంగులకు ప్రయోజనం చేకూరుతుందని ట్వీట్‌ చేశారు.




Next Story