కరోనా ఆంక్షలు పొడిగింపు.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

Telangana govt extends COVID restrictions till January 20. కోవిడ్ -19 వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు జనవరి 2 న మొదట విధించిన ఆంక్షలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి జనవరి 20 వరకు

By అంజి  Published on  10 Jan 2022 3:53 AM GMT
కరోనా ఆంక్షలు పొడిగింపు.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

కోవిడ్ -19 వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు జనవరి 2 న మొదట విధించిన ఆంక్షలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి జనవరి 20 వరకు పొడిగించింది. రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారంతో ఆంక్షలు ముగియాల్సి ఉండగా. మరో 10 రోజుల వరకు ఆంక్షలు పొడిగించింది. దీని ప్రకారం, జిఓ నంబర్ 6 మేరకు ర్యాలీలు, బహిరంగ సభలు, మత, రాజకీయ, సాంస్కృతిక సహా అన్ని రకాల సామూహిక సభలపై ఆంక్షలను జనవరి 20 వరకు పొడిగించారు. రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అంతకుముందు రోజు సమీక్ష నిర్వహించారు. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు, కార్యాలయాలు, దుకాణాలు, మాల్స్‌, వ్యాపార సంస్థలు, ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

ఇదిలా ఉంటే తెలంగాణలో ఇవాళ్టి నుండి హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, సీనియర్ సిటిజన్‌లకు కోవిడ్ వ్యాక్సిన్‌ల బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. ఆరోగ్య శాఖ అన్ని ప్రభుత్వ కోవిడ్ టీకా కేంద్రాలలో సంబంధిత ఏర్పాట్లను పూర్తి చేసింది. ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం, రాబోయే నెలల్లో మొత్తం 41.60 లక్షల మంది సీనియర్ సిటిజన్లు, 6.34 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు బూస్టర్ లేదా ముందుజాగ్రత్త కోవిడ్ వ్యాక్సిన్ డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 48,583 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 1,673 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసులు 6,94,030కి చేరాయి. అయితే గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పొలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,522 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Next Story