ఆశా వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి విజృంభణ వేళ.. కమీషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిపాలన కిందకు వచ్చే తెలంగాణలోని గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తల (ఆశా వర్కర్లకు) కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని 30 శాతం పెంచింది. ప్రభుత్వ ఉత్తర్వు (జీవో ఎమ్‌ఎప్ నం 1)లో రాష్ట్ర ప్రభుత్వం నెలవారీ పనితీరు ఆధారిత ప్రోత్సాహకం గరిష్ట పరిమితిపై 30 శాతం చొప్పున పెంపుదల కోసం అనుమతిని ఇచ్చింది. దీంతో రూ.7, 500 నుండి రూ.9,750లకు నెలవారీ ప్రోత్సహకాలు పెరగనున్నాయి.
సీహెచ్ అండ్ ఎఫ్‌డబ్ల్యూ, మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్, తెలంగాణ కింద పని చేస్తున్న ఆశా వర్కర్లకు ఈ ప్రోత్సహకాలు వర్తిస్తాయి. మెరుగుపరచబడిన నెలవారీ పనితీరు ఆధారిత ప్రోత్సాహకం జూన్ 1, 2021 నుండి జూలై 2021లో చెల్లించబడుతుంది. ప్రభుత్వం, సెక్రటరీ, ఆరోగ్యం, వైద్యం యొక్క ముందస్తు అనుమతితో నిమగ్నమై ఉన్న అన్ని ఆశా వర్కర్లలకు నెలవారీ పనితీరు ఆధారిత ప్రోత్సాహకం యొక్క పెంపుదల వర్తిస్తుంది. ఈ మేరకు కుటుంబ సంక్షేమం, తెలంగాణ, ఎస్‌ఏఎమ్ రిజ్వీ ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.