ఆ రెండు రోజులు హాలిడే ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం షియా ముస్లింలకు సంతాప దినంగా పిలిచే ముహర్రం సందర్భంగా 9, 10 తేదీలలో సెలవులు ప్రకటించింది.

By Medi Samrat  Published on  4 July 2024 7:45 PM IST
ఆ రెండు రోజులు హాలిడే ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం షియా ముస్లింలకు సంతాప దినంగా పిలిచే ముహర్రం సందర్భంగా 9, 10 తేదీలలో సెలవులు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం.. జులై 16, 17 తేదీల్లో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే జూలై 16న సెలవు ఐచ్ఛికం కాగా, జూలై 17న సాధారణ సెలవుదినం. నెలవంక దర్శనం ఆధారంగా ఈ సంతాప దినాలు ఉన్నందున ప్రభుత్వం 9వ తేదీ మొహర్రం(అషురా) సెలవులను మార్చవచ్చు.

ఇది ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెల మొహర్రం. ఈ మాసంలో షియా ముస్లింలు సంతాపం తెలుపుతారు. నెలవంక ఆధారంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం ముహర్రం జూలై 7, 2024 నుండి ప్రారంభమవుతుంది. అషురా జరుపుకునే తేదీ జూలై 17... జులై 6న నెలవంక కనిపించినట్లయితే ముహర్రం 9వ తేదీ అషురా జులై 15, 16 తేదీలలో జరుపుకుంటారు. లేకుంటే జులై 16, 17 తేదీల్లో పాటిస్తారు.

Next Story