హెచ్‌సీయూ విద్యార్థులపై న‌మోదైన కేసుల విష‌యంలో సర్కార్ కీల‌క‌ నిర్ణయం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియు) విద్యార్థులపై గచ్చిబౌలిలో నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పోలీసు అధికారులను కోరారు.

By Medi Samrat
Published on : 7 April 2025 8:15 PM IST

హెచ్‌సీయూ విద్యార్థులపై న‌మోదైన కేసుల విష‌యంలో సర్కార్ కీల‌క‌ నిర్ణయం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియు) విద్యార్థులపై గచ్చిబౌలిలో నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పోలీసు అధికారులను కోరారు. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస నిరసనలు చేపట్టిన విద్యార్థులకు ఉప ముఖ్యమంత్రి నిర్ణయం ఉపశమనం కలిగించింది.

జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్ అధికారులకు తగు సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులను ఆదేశించారు.

Next Story