తెలంగాణ గవర్నర్ గవర్నర్ తమిళిసై మరోసారి ఆ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని.. రెండేండ్ల నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు నాకు అందుబాటులో ఉండటం లేదన్నారు. ఇబ్బందులను అవకాశంగా మలుచుకోవడమే నాకున్న బలం. ఆ బలంతోనే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్నా అని గవర్నర్ తమిళిసై అన్నారు. రాష్ట్రానికి గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించాలంటే ఫస్ట్ నేను మానసికంగా బలంగా ఉండాలని అప్పుడే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దాటుకుని ముందుకెళ్లగల్గుతానని అన్నారు. నేనొక డాక్టరే అయినా.. తెలంగాణ సోదరిని అని చెప్పారు. బాధ్యతలను ఒత్తిడితో చూడొద్దు. చేసే పనిని ఆస్వాదించాలని తమిళిసై తెలిపారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి మహిళా ముందుకు రావాలని సూచించారు. సేవ ఎక్కడుంటే తానూ అక్కడే ఉంటానని చెప్పారు. లైంగిక వేధింపులపై ఆడ పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు తమ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ను రాజకీయాలకు అతీతంగా ప్రతి రాష్ట్రంలోనూ అమలు చేయాలని తమిళిసై కోరారు. రాష్ట్రంలో ఈ స్కీమ్ అమలు చేస్తే ఎంతో మంది పేదలకు మేలు కలుగుతుందన్నారు. జీవితంలో సవాళ్లు ఎదుర్కోవాలంటే సంపూర్ణ ఆరోగ్యం అవసరమని అన్నారు. స్టూడెంట్స్ కు ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా ముఖ్యమని సూచించారు.