బనకచర్లపై చర్చ అవసరం లేదంటూ ఏపీకి షాక్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. బనకచర్లపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఈ లేఖ రాసింది. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే రేపటి సమావేశంలో బనకచర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాగా రేపు జరిగే తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఏపీ సర్కార్ సింగిల్ ఎజెండా ఇచ్చింది. ఇటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఎజెండా పంపింది. కాగా జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఏసీ బనకచర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. ఇప్పటివరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవంటూ పూర్తి వివరాలను తెలంగాణ ప్రభుత్వం ఈ లేఖలో ప్రస్తావించింది.