తెలంగాణలోని 33 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ ఫండ్స్‌ను రిలీజ్ చేసింది. జిల్లాకు రూ. కోటి చొప్పున 33 జిల్లాలకు రూ.33 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఎమర్జెన్సీ సేవలు, వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. అలాగే, కలెక్టర్లకు అత్యవసర నిధి కేటాయిస్తామని CM రేవంత్ తెలిపారు.
కాగా భారీ వర్షాలు, వరదలను సకాలంలో ఎదుర్కోవడానికి, ముందస్తు సన్నాహాలు చేపట్టడానికి కావాల్సిన పరికరాల కొనుగోలు కోసం ఈ నిధులు కేటాయించింది. ఎయిర్ బోట్లు, లైఫ్ జాకెట్, మైక్ సెట్, రోప్, గ్యాస్ లైట్..లాంటి పరికరాల కొనుగోలు కోసం ఈ నిధులు ఉపయోగించనున్నారు.