మూడెకరాలలోపు రైతులకు గుడ్ న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ

తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది.

By Knakam Karthik
Published on : 12 Feb 2025 3:51 PM IST

Telangana, Congress Government, RythuBharosa, Cm Revanth, Farmers

మూడెకరాలలోపు రైతులకు గుడ్ న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ

తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. జనవరి 26న ఈ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వ నిధుల జమను ప్రారంభించింది. ఫిబ్రవరి 5న 17.03 లక్షల మందికి, ఫిబ్రవరి 10న 8.65 లక్షల మందికి విడతల వారీగా నిధులు జమ చేసినట్లు ప్రకటించింది. కాగా ఇప్పటివరకు 2 ఎకరాల లోపు ఉన్న 34 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2200 కోట్లు జమ చేసింది. మొత్తంగా 37 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం నగదును జమ చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

Next Story