అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 'అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి' పథకంలో సీట్ల సంఖ్యను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే SC విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఇప్పటివరకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంలో కేవలం 210 సీట్లు ఉండగా.. ఇపుడు వాటి సంఖ్యను 500 కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
వెనుకబడిన తరగతుల విద్యార్థులు నుంచి వస్తున్న భారీ వినతులను దృష్టిలో ఉంచుకొని, SC స్టూడెంట్స్ కు మరింత చేయూత అందించేందుకు సీట్ల పెంపు చేసింది. ఈ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కమిషనర్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖను ఆదేశించింది.