ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ క్యాలెండర్ సంవత్సరం (2026) నుండి 2.1% DA ను పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
By - Medi Samrat |
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ క్యాలెండర్ సంవత్సరం (2026) నుండి 2.1% DA ను పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇంతకు ముందు 50.7% DA ఉండగా, ఇపుడు దాన్ని 52.8% కి పెంచారు. పెరిగిన DA జనవరి 1, 2026 నుండి అమలుకానుంది. గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది. పెరిగిన డీఏ ద్వారా ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.
రాష్ట్ర ప్రభుత్వం చివరగా జూలై 2025లో 2.1% DA పెంచింది. 48.6% నుండి 50.7% నికి పెంచింది. ప్రస్తుతం పెరిగిన 2.1 శాతం డీఏ తో 52.8 % కి చేరింది. మే 2024 లో RPS - 2017 అమలు తరువాత ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు లేవని మంత్రి తెలిపారు. డీఏ పెంపు సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆర్టీసీ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ ప్రకటించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్టీసీ ఎండీ ఇతర ఉన్నతాధికారులు అభినందించారు. ఆర్టీసీ లో పెండింగ్ పనులు అభివృద్ధి కార్యక్రమాలపై పలు రీజియన్ లో ఆర్ ఎం లతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశాన్ని నిర్వహించారు.. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు..
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డీఏ ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. జనవరి 2026 నుండి 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వచ్చింది... దీంతో సవరించిన డీఏ వల్ల 52.8 శాతానికి చేరింది. జనవరి నుండి ఇవ్వాల్సిన పెండింగ్ డీఏ లు భవిష్యత్ లో వచ్చే మూడు నెలలకు గాను ఒక్కో నెలలో విడుదల చేయడం జరుగుతుందని వివరించారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో మొదటి నుండి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌల్యభం కేంద్రంగా పని చేస్తుందన్నారు.
సంస్థకు ప్రధానంగా కార్మికుల సంక్షేమం ప వారికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణ కు ఆసుపత్రి అప్గ్రెడేషన్, కారుణ్య నియామకాలు, దీర్ఘ కాలంగా రిమూవ్ అయిన వారిని త్రిమెన్ కమిటీ ద్వారా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం, కొత్త నియామకాలు చేపట్టి పని భారం తగ్గించడం, కొత్త బస్సులు కొనుగోలు లాంటి అనేక కార్యక్రమాలు చేస్తుందని వివరించారు.