ఆ 400 ఎకరాల భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

By Knakam Karthik
Published on : 4 April 2025 6:45 AM IST

Telangana, Hyderabad News, Kancha Gachibowli Land Dispute, Congress Government

ఆ 400 ఎకరాల భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్​ బాబు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీ సెంట్రల్​ యూనివర్సిటీ(HCU) విద్యార్థులు, ప్రజా సంఘాలతో సంప్రదింపులు జరపనుంది.

కాగా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం, యూనివర్సిటీ విద్యార్థుల మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరో వైపు.. ఈ భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. వర్సిటీలో చెట్లను కొట్టివేయడంపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వంద ఎకరాల్లో చెట్లు నరికి వేయడం అనేది చిన్న విషయం కాదని.. చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది. తమ ప్రశ్నలకు సీఎస్‌ సమాధానం చెప్పడంతో పాటు అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.

Next Story