తెలంగాణలో సుపరిపాలన లక్ష్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ప్రతి నెలా రెండు సార్లు మంత్రి వర్గ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇక నుంచి ఈ-కేబినెట్ సిస్టమ్‌ను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. కేబినెట్ మీటింగ్‌లోని ఫైల్స్ అన్నింటినీ డిజిటల్ విధానంలో భద్రపరచాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఫైలింగ్ విధానంలో కేబినెట్ ఎజెండా, నిర్ణయాలు డిజిటల్ భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
ఇక ప్రతి నెలలో రెండు సార్లు నిర్వహించే కేబినెట్ తేదీని కూడా ఖరారు చేసింది. జులై 10న రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం జరగనుంది. 15 రోజులకోసారి చొప్పున ప్రతి నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ఇటీవలే సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయాలు వెంటనే అమలయ్యేలా సమావేశాలు ఉండాలని అధికారులకు సూచించారు. సంస్కరణల్లో భాగంగా మూడు నెలలకొకసారి మంత్రివర్గ సమావేశాన్ని స్టేటస్ రిపోర్టు మీటింగ్‌గా నిర్వహించాలని నిర్ణయించారు. కాగా ఈ సమావేశంలో మూడు నెలల వ్యవధిలో జరిగిన కేబినెట్ మీటింగ్ నిర్ణయాలు, వాటి ఇంప్లిమెంటేషన్‌కు తీసుకున్న చర్యల రిపోర్టును (యాక్షన్ టేకెన్ రిపోర్టు)ను ఈ ప్రత్యేక సమావేశంలో సమర్పించి చర్చించనున్నారు.