ఏపీలో బర్డ్ ఫ్లూతో పలు ఫారాల్లో కోళ్లు మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వ్యాధిపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ఫారాల్లో బర్డ్ ఫ్లూతో కోళ్లు మృతి చెందాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇటీవల రాష్ట్రంలోని ఖమ్మం, సత్తుపల్లిలో కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూ కారణమని భావిస్తున్నారు.