తెలంగాణ ఎంసెట్ తేదీలు వచ్చేశాయి..!

తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్) తేదీలు ఖరారయ్యాయి.

By Medi Samrat  Published on  6 Feb 2024 11:12 AM GMT
తెలంగాణ ఎంసెట్ తేదీలు వచ్చేశాయి..!

తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్) తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి ప్రకటించారు. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపారు. మే 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది జేఎన్టీయూ హైదరాబాద్ ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు.

ఫిబ్రవరి 21న టీఎస్ ఎంసెట్‌ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. 21న నోటిఫికేష‌న్ విడుద‌ల చేసి, 26 నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్లో స్వీక‌రించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు చివ‌రి తేదీ ఏప్రిల్ 6 గా నిర్ణయించారు. మే 9వ తేదీ నుంచి 12 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ పరీక్షలను జేఎన్టీయూ నిర్వ‌హించ‌నుంది. గతంలో ఇంజినీరింగ్, మెడికల్‌లో ప్రవేశాలకు ఎంసెట్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేసే వారు. కానీ, ప్రస్తుతం మెడిసిన్, డెంటల్, యునానీ, ఆయుర్వేద, హోమియో కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెడిసిన్(ఎం) అనే పదాన్ని ఎంసెట్ నుంచి తొలగించింది. దీంతో ఎంసెట్ కు బదులు ఎప్‌సెట్‌గా మారనుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు మాత్రమే నిర్వహించే పరీక్ష కావడంతో ఎప్‌సెట్(టీఎస్ ఈఏపీసీఈటీ)‌గా పేరు ఖరారు చేశారు.

Next Story