లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోటీ.. కానీ: సీపీఐ ఎమ్మెల్యే
బీఆర్ఎస్‌పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 21 Jan 2024 11:45 AM GMTలోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోటీ.. కానీ: సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
బీఆర్ఎస్‌పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శలు చేశారు. అధికారం కోల్పోవడంతో కేటీఆర్ మతిస్థిమితం లేనట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్‌కు ఇంకా నిరంకుశ విధానాలు పోవడంలేదని అన్నారు. కరెంటు బిల్లులు కట్టొద్దంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారనీ.. ఇలా మాట్లాడటం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేతలు అవమానిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేయడం అంటే చట్టబద్దత రావడం.. కొంచెం ఆలస్యమైనా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందనిచెప్పారు. కానీ.. పరిపాలన చేసే హక్కు లేదన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సరికాదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్నేహ ధర్మం పాటించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో తాము కోరే ఐదు స్థానాలను కేటాయించాలని కూనంనేని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్‌కు ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారనీ.. ఒకట్రెండు కంటే ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ గెలవలేదని జోస్యం చెప్పారు. ఇక బీఆర్ఎస్, బీజేపీకి మద్దతు ఇస్తోందని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ఎప్పటికైనా ఒక్కటే అన్నారు. కాళేశ్వరం అవినీతి నుంచి బయట పడేందుకే బీఆర్ఎస్ నేతలు బీజేపీకి సానుకూలంగా ఉటూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్‌తో ఎంఐఎం కలిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.