తెలంగాణ రాష్ట్రంలో.. కొత్తగా మరో 3 ఓమిక్రాన్‌ కేసులు నమోదు

Telangana corona update for the last 24 hours. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్‌ సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మరో 3 ఓమిక్రాన్‌

By అంజి  Published on  25 Dec 2021 2:58 PM GMT
తెలంగాణ రాష్ట్రంలో.. కొత్తగా మరో 3 ఓమిక్రాన్‌ కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్‌ సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మరో 3 ఓమిక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఓమిక్రాన్‌ కేసుల సంఖ్య 41కి చేరింది. కాగా ప్రమాదకర దేశాల నుండి గడిచిన 24 గంటల్లో 333 మంది హైదరాబాద్‌లోని రాజీవ్‌ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారందరికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేశారు. 8 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. పాజిటివ్‌గా నిర్దారణ అయిన వారి నమూనాలను అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఓమిక్రాన్‌ వేరియంట్‌ వెలుగు చూసిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రమాదకర, ప్రమాద రహిత దేశాల నుండి 11,245 మంది ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేశారు. వారిలో 83 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కాగా.. వారి నమూనాలను జోనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు.

అందులో 22 మందికి ఓమిక్రాన్‌ నెగిటివ్‌ రాగా.. 61 మందికి ఓమిక్రాన్‌ పాజిటివ్‌ అని నిర్దారణ అయ్యింది. ఇప్పటి వరకు 10 మంది ఓమిక్రాన్‌ బాధితులు కోలుకున్నారు. మరో 20 మంది నమూనాల ఫలితాల రావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 26,947 కరోనా పరీక్షలు చేయగా.. 140 మంది కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,80,553కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 4,021కు చేరింది. తాజాగా 186 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,499 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Next Story