రేపు మండల కేంద్రాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టనున్నారు. టీపీసీసీ పిలుపు మేరకు భూమి, వ్యవసాయ సమస్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మార్వోలకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం కోసం టీపీసీసీ ఇప్పటికే జిల్లాలకు సీనియర్ నాయకులను ఇంచార్జ్ లుగా నియమించింది. టీపీసీసీ ఆధ్వర్యంలో వ్యవసాయ, రైతు, భూమి సంబంధ అంశాలపై రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు చేపడుతారు. అనంతరం మండల రెవిన్యూ అధికారులకు వినతి పత్రాలు అందజేస్తారు. ఈ విషయమై ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ల ఆధ్వర్యంలో టీపీసీసీ నాయకులు 21న సీఎస్ సోమేష్ కుమార్‌ను సచివాలయంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. 24న మండలాల్లో, 30న నియోజకవర్గ కేంద్రాలలో, డిసెంబర్ 5న జిల్లా కేంద్రాలలో ధర్నాలకు టీపీసీసీ పిలుపునిచ్చింది.