రేపు కాంగ్రెస్ సీఎల్పీ మీటింగ్..ఆ నాలుగు అంశాలపై చర్చ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.

By Knakam Karthik
Published on : 14 April 2025 1:45 PM IST

Telangana, Cm Revanthreddy, CLP Meeting, Congress

రేపు కాంగ్రెస్ సీఎల్పీ మీటింగ్..ఆ నాలుగు అంశాలపై చర్చ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ విప్ లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో నాలుగు కీలకమైన అంశాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు ఆ పార్టీ తెలిపింది. భూ భారతి, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ జరగనుంది.

ఇటీవల ప్రభుత్వం వరుసగా పలు ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ జీవో జారీ చేసింది. ధరణి రద్దు చేసి భూ భారతిని ఇవాళ్టి నుంచి అమలులోకి తీసుకురాబోతున్నది. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంపై సీఎం ఈ సీఎల్పీ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నట్ల తెలుస్తోంది.

Next Story