14 నుంచి మ‌రో కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన టీకాంగ్రెస్‌

Telangana Congress Begins Padayatra From Nov 14th. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్యర్యంలో ఈ నెల 14 నుంచి 21 వరకు కాంగ్రెస్ జన జాగరణ ప్రజా చైతన్య

By Medi Samrat  Published on  12 Nov 2021 2:57 PM GMT
14 నుంచి మ‌రో కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన టీకాంగ్రెస్‌

రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్యర్యంలో ఈ నెల 14 నుంచి 21 వరకు కాంగ్రెస్ జన జాగరణ ప్రజా చైతన్య పాదయాత్ర ఉంటుందని ఏఐసీసీ కార్యనిర్వహణ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అన్ని చోట్ల కాంగ్రెస్ నేతలు జిల్లా కలెక్టర్ల పర్మిషన్లు తీసుకొని యాత్రలు చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌కు లోబడి ఈ యాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు అనుమతులు ఇవ్వకుంటే గాంధీ భవన్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. అధికార పార్టీ చేపట్టిన ధర్నాకు కొవిడ్ నిబంధనలు ఉండవా అని ఆయన ప్రశ్నించారు. 31 జిల్లాలకు 50 నుంచి 60 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇంఛార్జిలుగా, డీసీసీ ప్రెసిడెంట్లు కన్వీనర్లుగా ఉంటారని ఆయన తెలిపారు.

ఖమ్మం జిల్లాలో భట్టి, రేణుకా చౌదరి, వికారాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటారన్నారు. మెదక్ జిల్లాలో దామోదర్ రాజనర్సింహ, దాసోజు, వరంగల్‌లో కొండా దంపతులు, సిరిసిల్ల జిల్లాలో మాజీ ఎంపీ రాజయ్య పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. కొత్తగూడెంలో పొడెం వీరయ్య, నిర్మల్ జిల్లాలో మహేశ్వర్ రెడ్డి, జనగాం జిల్లాలో పొన్నాల, ములుగు జిల్లాలో ఎమ్మెల్యే సీతక్క పాదయాత్రలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.


Next Story
Share it