తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. 2025-26 విద్యాసంవత్సరంలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను కూడా ఖరారు చేసింది. ఈ మేరకు పరీక్ష తేదీలను బుధవారం ఉన్నత విద్యామండలి వెల్లడించింది.
పరీక్షల షెడ్యూల్:
ఏప్రిల్ 29 నుండి మే 5 వరకు ఎప్ సెట్ (EAPCET)
(ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్, ఫార్మసీ)
(మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్)
మే 12న ఈ సెట్
జూన్ 1న ఎడ్ సెట్
జూన్ 6న లా సెట్, పీజీ ఎల్.సెట్
జూన్ 8, 9న ఐసెట్
జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్
జూన్ 11 నుంచి 14 వరకు పీ సెట్ పరీక్షలు