చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం సాయంత్రం అర్చకులు రంగరాజన్‌కు ఫోన్ చేసి సీఎం రేవంత్ పరామర్శించారు. దాడి జరిగిన తీరుపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చారు. ఇలాంటి దాడులను సహించేది లేదని.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా అంతకుముందు దాడి ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా స్పందించారు. రామ రాజ్యం పేరుతో దాడులు చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వార్నింగ్ ఇచ్చారు.