ఢిల్లీలో సీఎం బంగ్లా దావత్‌లు చేసుకోడానికి కాదు..సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

By Knakam Karthik
Published on : 15 Aug 2025 3:54 PM IST

Telangana, Cm Revanthreddy, Credai Property Programme, Congress Government

ఢిల్లీలో సీఎం బంగ్లా దావత్‌లు చేసుకోడానికి కాదు..సీఎం రేవంత్ హాట్ కామెంట్స్

క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకునేవారికి కనువిప్పు కలిగించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తున్నా...అని సీఎం మాట్లాడారు. ప్రభుత్వం పాలసీ, కన్స్ట్రక్షన్ రెండూ రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ లాంటివి. పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకుండా చూడటం వల్లే మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. నాయకుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు కొంతకాలం ఇలాంటి అనుమానాలు, అపోహలకు తావిస్తుంది. పారదర్శక పాలసీలతో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. పెట్టుబడులకు రక్షణ కల్పించడమేకాదు.. లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వానిది.. మాది. రాజకీయ నాయకులు సృష్టించే అపోహలకు మీరు ఊతం ఇస్తే నష్టపోయేది మీరే. అలాంటి అపోహలను తొలగించడానికే ఇక్కడికి వచ్చా. ఇతర దేశాల ప్రతినిధులను ఇక్కడ పెట్టుబడులకు ఆహ్వానించే మేము… ఇక్కడే ఉన్న మిమ్మల్ని ఎందుకు వదులుకుంటాం? పెట్టుబడుల విషయంలో మీకే మా మొదటి ప్రాధాన్యత. నేను సగటు మధ్యతరగతి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని. కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న విశాల దృక్పథం ఉన్న వాడిని కాదు . సమాజ శ్రేయస్సు కోసమే నేను ఆలోచిస్తా. అందుకే మీరు అడిగిన కొన్నింటికి నేను అంగీకరించకపోవచ్చు. నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను. పారదర్శక విధానంలో ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధికి సహకరించేందుకు నాకు అభ్యంతరం లేదు...అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

జైపాల్ రెడ్డి గారి చొరవతో హైదరాబాద్ నగరానికి మెట్రో వచ్చింది. పదేళ్లుగా మెట్రో విస్తరణ జరగలేదు. అలా జరిగి ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య కొంతైనా పరిష్కారమయ్యేది. జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మల్టీ యూనిట్ ఉండే ట్రాన్స్‌పోర్టేషన్ ఉండాలి. లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయడానికి నేను శాయశక్తులా ప్రయత్నిస్తున్నా. షామీర్ పెట్, మేడ్చల్ వరకు మెట్రో విస్తరణకు కృషి చేస్తున్నాం. మన నగరం ప్రతిష్ట పెంచడానికే మా ప్రయత్నం. మాటిమాటికీ ఢిల్లీకి వెళుతున్నారని కొందరు మాట్లాడుతున్నారు. మెట్రో, మూసీ, ఇతర అనుమతులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే అక్కడికి కాకుండా ఎక్కడికి వెళతారు. ఢిల్లీలో ముఖ్యమంత్రికి బంగ్లా ఇచ్చింది నెలకు నాలుగురోజులు వెళ్లి కేంద్రంతో అనుమతులు తెచ్చుకోవడానికే. దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నా. అది ఫామ్ హౌస్ లా వాడుకుని దావత్ లు చేసుకునేందుకు కాదు..అని సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Next Story