ఉస్మానియా ఆస్పత్రి వైద్యులపై సీఎం రేవంత్ ప్రశంసలు

హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ వైద్యులను ప్రశంసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా ఓ ట్వీట్ చేశారు.

By Knakam Karthik
Published on : 18 April 2025 11:39 AM IST

Telangana, Hyderabad News, Osmania Hospital Doctors, Cm Revanthreddy

ఉస్మానియా ఆస్పత్రి వైద్యులపై సీఎం రేవంత్ ప్రశంసలు

హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ వైద్యులను ప్రశంసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు’.. అన్న నానుడిని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు తిరగరాశారని రాసుకొచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తలచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని రుజువు చేశారని అన్నారు.

ఇటీవల షిర్డీకి వెళ్తున్న క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన 22 ఏళ్ల యువకుడిని చేర్చుకునేందుకు ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది నిరాకరించడంతో అతడి కుటుంబ సభ్యులు ఉస్మానియాకు తరలించారు. అక్కడ వైద్యులు యువకుడిని అడ్మిట్ చేసుకుని శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆ యువకుడు కోలుకున్నాడు. ఇందుకు సంబంధించి ఓ దినపత్రికలో వచ్చిన కథనంపై సీఎం తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా రెస్పాండ్ అయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిన ఉస్మానియా వైద్యులు డాక్టర్ రంగా అజ్మీరా, డాక్టర్ విక్రమ్ బృందం ఆదర్శంగా నిలిచారని అభినందించారు.

Next Story