సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్‌వన్‌గా నిలపడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

దేశంలోనే సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik  Published on  18 Feb 2025 2:13 PM IST
Telugu News, Hyderabad, Cm RevanthReddy, Telangana cybersecurity summit SHIELD

సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్‌వన్‌గా నిలపడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

దేశంలోనే సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.హెచ్ఐసీసీలో నిర్వహించిన 'షీల్డ్ 2025' సదస్సులో ఆయన మాట్లాడారు. డిజిటల్ సేఫ్టీ, ఫ్యూచర్ గురించి చర్చించేందుకు నిర్వహించిన షీల్డ్-2025 కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. మొదటిసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను అభినందిస్తున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు.

దేశంలో సైబర్ నేరగాళ్లు గత సంవత్సరం రూ.22,812 కోట్లు దోచుకున్నారని ఒక అంచనా, ఇది మన ఆర్థిక వ్యవస్థ, పౌరులకు ముప్పు.. అని సీఎం రేవంత్ తెలిపారు. ప్రస్తుత రోజుల్లో ఫేక్ న్యూస్ కూడా మరో ప్రధానమైన ముప్పు అని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో సమాజంలో గందరగోళం ఏర్పడుతుందని చెప్పారు. తెలంగాణలో ప్రత్యేకమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశాం. సైబర్ నేరాల్లో సొమ్ము రికవరీల్లో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారు. గతేడాది సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా 7 పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశాం. ఒకప్పుడు ఇంట్లో చొరబడి మాత్రమే దోపిడీలు చేసేవారు. ఇప్పుడు దొంగలు ఎక్కడో ఉండి.. మన సొమ్ము దొంగిలిస్తున్నారు. నేరం ఎక్కడి నుంచి ఎవరు చేశారో కనుక్కోవడం పెద్ద సవాలుగా మారింది. నేరాల శైలి మారుతోంది. వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలి " అని అన్నారు. నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం కాదు.. నేరం జరగకుండా నిరోధించేలా సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

తెలంగాణను సెక్యూరిటీ బిజినెస్ హబ్‌గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 1930నంబర్ ను అందరికీ షేర్ చేయాలని ప్రతీ ఒక్కరినీ కోరుతున్నట్లు చెప్పారు. పూర్తిస్థాయిలో పనిచేసే సైబర్ సెక్యూరిటీ బ్యూరో, పౌరులను రక్షించడానికి అంకితమైన సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్ గా మార్చేందుకు మనమంతా కలిసి పని చేద్దాం అని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. సైబర్ క్రైమ్ నియంత్రణలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా తీర్చి దిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story